Bright Telangana
Image default

Megastar Chiranjeevi: మెగాస్టార్ నోట ‘రంగ మార్తాండ’ షాయరీ

Nenoka Natudni Ft. Megastar Dr. Chiranjeevi - Rangamarthanda

Nenoka Natudni Ft. Megastar Chiranjeevi in Rangamarthanda Movie : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన ఈ కథలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ, కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరాఠీ చిత్రం ‘నట సమ్రాట్’కు ఇది రీమేక్. ఈ మూవీలోని ఫస్ట్ సింగల్ (షాయరీ) ‘నేనొక నటుడ్ని’ బుధవారం విడుదలైంది. మెగస్టార్ చిరంజీవి తనదైన శైలిలో చెప్పిన ఈ షాయరీ ని ప్రముఖ రచయిత లక్ష్మీ భూపాల రాశారు. మాస్ట్రో ఇళయరాజా నేపధ్య సంగీతం అందించారు.

ఈ షాయరీ వినే ప్రతి నటుడు తన కోసమే రాశారని భావించేలా లక్ష్మీ భూపాల ఎంతో అర్థవంతంగా దీనిని రాయడం విశేషం. మెగాస్టార్ అద్భుతంగా తన గొంతులో నవరసాలు పలికించి ఈ షాయిరీకి ప్రాణం పోశారు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ రంగమార్తాండ సినిమాకు ఈ షాయరీ అద్దం పడుతోంది. ఈ పాటను లక్ష్మీ భూపాలతో రాయించగానే తన మదిలో చిరంజీవే మెదిలారని, ఆయన్ని అడగగానే పాడటానికి అంగీకరించడం ఆనందాన్ని కలిగించిందని ఇటీవల కృష్ణవంశీ ఎన్టీవీతో తెలిపారు.

Related posts

Acharya Trailer : ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ మామూలుగా లేదుగా..

Hardworkneverfail

Waltair Veerayya : ఈ పాట ఎలివేషన్స్ కా బాప్..

Hardworkneverfail

Acharya Movie: ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

Boss Party Song : భలేగా ‘వాల్తేరు వీరయ్య’ ‘బాస్ పార్టీ’సాంగ్ !

Hardworkneverfail

Waltair Veerayya : ఓటిటి లో సందడి చేస్తున్న వాల్తేర్ వీరయ్య..

Hardworkneverfail