Bright Telangana
Image default

Waltair Veerayya : ఈ పాట ఎలివేషన్స్ కా బాప్..

Veerayya Title Track

Veerayya Title Track : మెగాస్టార్ ని మాస్ అవతారంలో మళ్లీ చూపిస్తాను అని మెగా అభిమానులకి మాటిచ్చిన దర్శకుడు బాబీ, ఆ మాటని నిజం చేసి చూపిస్తున్నాడు. పోస్టర్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తూ ఒకప్పటి చిరుని గుర్తు చేస్తున్న బాబీ, చిరు ఫాన్స్ కోసం ‘వీరయ్య టైటిల్ సాంగ్’ని చాలా స్పెషల్ గా రెడీ చేసినట్లు ఉన్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బం నుంచి మూడో సాంగ్ గా బయటకి వచ్చిన ‘వీరయ్య’ టైటిల్ సాంగ్ పూనకలు తెచ్చే రేంజులో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ చెప్పిన సమయం కన్నా కాస్త ఆలస్యంగా ‘వీరయ్య సాంగ్’ని యుట్యూబ్ లో రిలీజ్ చేశారు కానీ అభిమానుల వెయిటింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ న్యాయం చేశాడు. చిరుకి టైటిల్ సాంగ్ కొట్టాలి అంటే అది దేవి శ్రీ ప్రసాద్ తర్వాతే అని మరోసారి ప్రూవ్ చేసిన ‘వీరయ్య’ టైటిల్ సాంగ్ ని అనురాగ్ కులకర్నీ గూస్ బంప్స్ వచ్చే రేంజులో పాడాడు.

వాల్తేరు వీరయ్య మూవీలో ఈ టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చేలా ఉంది, ఈ రేంజ్ హై ఇంటెన్సిటీ ఉన్న సాంగ్ కి పర్ఫెక్ట్ విజువల్స్ పడితే థియేటర్స్ టాప్ లేచిపోవడం గ్యారెంటీ. వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటివరకూ వచ్చిన రెండు సాంగ్స్ ఒకెత్తు, ఈ టైటిల్ సాంగ్ ఒకెత్తు. భగ భగ అంటూ మొదలైన లిరిక్స్… తుఫాన్ అంచున తపస్సు చేసే వశిష్టుడంటే అది వీడే, తలల్ని తీసే విషుస్టుడే వీడే అంటూ చిరు క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ టైటిల్ సాంగ్ లో ఎంత ఇంటెన్సిటీతో ఉన్నాయో, దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ మధ్యలో నుంచి కొట్టిన బిట్ మ్యూజిక్ అంతే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా 1:50 నిమిషాల నుంచి ఎండ్ వరకూ రెండున్నర నిమిషాల పాటు దేవి శ్రీ ప్రసాద్ హై వోల్టేజ్ బీట్ కొట్టాడు. ఈ పాట డెఫినేట్ గా ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ కి కొత్త జోష్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

https://music.youtube.com/playlist?list=OLAK5uy_n_vOl7OMRzcg2c0mJxtwufTlW2ih5D3a8&feature=share

Related posts

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్..

Hardworkneverfail

Mega 154 : మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ.. వీడియో అదిరిపోయిందిగా..

Hardworkneverfail

Waltair Veerayya : వీరయ్య లుక్ తో ఫ్యాన్స్ లో పూనకాలు లోడింగ్..

Hardworkneverfail

God Father Movie Review : తలరాతనే కాదు.. సినిమా రాతను మార్చేసిన బ్రహ్మ.. ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ..

Hardworkneverfail

Waltair Veerayya Review: ‘వాల్తేరు వీరయ్య’ పూనకాలు తెప్పించిందా..!

Hardworkneverfail

Pushpa Trailer : తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్.. ‘పుష్ప’ మూవీ ట్రైలర్

Hardworkneverfail