God Father Movie Review : మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ గాడ్ ఫాదర్. మలయాళ హిట్ మూవీ లూసిఫర్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇక ఈ మూవీ దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 5 )న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి ‘గాడ్ ఫాదర్’ మూవీ ఎలా ఉంది? పూర్తి రివ్యూ చదవండి..
గాడ్ ఫాదర్ కథ విషయానికి వస్తే:
రాష్ట్ర సీఎం మరణానంతరం రాష్ట్రంలో అంతర్గతంగా రాజకీయాలు మారిపోవడంతో సీఎం కూతురు సత్య ప్రియ (నయనతార), సీఎం అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) పేర్లు తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలనలో ఉంటాయి. అప్పుడు, బ్రహ్మ (చిరంజీవి) అన్ని రాజకీయ నాటకాలను అదుపులో ఉంచడానికి సన్నివేశంలోకి ప్రవేశిస్తాడు మరియు ప్రతిదానికీ బాధ్యత వహిస్తాడు. బ్రహ్మ మరియు జయ దేవ్ రాజకీయాలలో రకరకాల మైండ్ గేమ్‌లు ఆడుతుంటారు. దివంగత సీఎం.. బ్రహ్మకు ఎలా నిజమైన వారసుడు అవుతాడు అనేది గాడ్ ఫాదర్ మూవీ మిగిలిన కథ.
ఫస్ట్ హాఫ్ లో మెగాస్టార్ చిరంజీవిని టైటిల్స్ తర్వాత అద్భుతమైన ఎలివేషన్‌తో పరిచయం చేశారు. ఆసక్తిగా నడిచే కథనం, ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేలా ఉంది. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సత్యదేవ్ కూడా చాలా బాగా నటించాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పూరి జగన్నాథ్ ఆకట్టుకున్నాడు. మ్యూజిక్ విషయానికి ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అరుపులే అని చెప్పొచ్చు. ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించాయి.
మొత్తం మీద మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి లుక్స్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇక అన్న అంటే ఇష్టం లేని పాత్రలో నయన్ ఎంతో పొందికగా కనిపించగా.. విలన్ గా సత్యదేవ్ ఒక రేంజ్ లో విలనిజాన్ని పండించాడు. సెకండ్ హాఫ్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గ్రాండ్ ఎంట్రీ బాగుంది.. బడా భాయ్ ఏది చెప్తే అది చేసే ఛోటా భాయ్ పాత్రలో సల్మాన్ ఖాన్ మెప్పించాడు.
ఒరిజినల్ చూసిన వాళ్ళకి మూవీ బాగుంది అనిపిస్తుంది కానీ అదే టైం లో ఒరిజినల్ చూడని వాళ్ళకి మూవీ ఇంకా బాగా నచ్చుతుంది, కొన్ని ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్, చిరంజీవి లుక్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ కి థ్రిల్ ని కలిగించడం ఖాయం. మొత్తం మీద గాడ్ ఫాదర్ మూవీ ఒరిజినల్ మ్యాజిక్ ని చాలా వరకు రీ క్రియేట్ చేసింది అని చెప్పాలి. ఓవరాల్ గా ఓ మంచి పొలిటికల్ యాక్షన్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పొచ్చు..
BOSS is Back with a Bang..
మొత్తం మీద మూవీకి మా రేటింగ్ 3.75 స్టార్స్..