Bright Telangana
Image default

Unesco : యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్ కు చోటు

warangal joins unesco global network of learning cities

Warangal Joins Unesco Global Network of Learning Cities : వరంగల్‌ నగరానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) జాబితాలో వరంగల్ చేరింది. యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్ చేరిందంటూ కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

దీంతో పాటు వరంగల్ కు, తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతోషం వ్యక్తం చేస్తూ వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గుర్తింపు కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

ఏడాది వ్యవధిలో యునెస్కో నుంచి మరో అరుదైన గుర్తింపును సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుదుగా చెప్పుకొనే యునెస్కో గుర్తింపును ఏడాది కాలంలో రెండుసార్లు సాధించడం ఈ నగరానికి ఉన్న ప్రత్యేకత.

కాగా, ఇది ప్రధాని మోదీ ఘనత అని తెలంగాణ బీజేపీ ప్రచారం చేసుకుంటుండగా, ఈ గుర్తింపు కోసం కృషి సల్పిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు అంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.

Related posts

Bandi Sanjay: ముగిసిన ప్రజా సంగ్రామ యాత్ర.. భావోద్వేగానికి గురైన బండి సంజయ్

Hardworkneverfail

CM KCR Warangal Tour : నేటి సీఎం కేసీఆర్ వరంగల్‌ పర్యటన రద్దు..

Hardworkneverfail

High Court of Telangana : బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి

Hardworkneverfail

Warangal : వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1100 కోట్లు.. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Hardworkneverfail

గొర్రెల పథకంలో అవకతవకలు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

Hardworkneverfail