Bright Telangana
Image default

గొర్రెల పథకంలో అవకతవకలు: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌

వరంగల్‌: బుధవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాదీక్షలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన గొల్ల కురుమలకోసం రూ.8వేల కోట్లు గొర్రెల పథకం కింద ఖర్చుపెట్టారని, ఇందులో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు . ఏ రాజకీయ పార్టీ కూడా గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై మాట్లాడటం లేదన్నారు.

గొల్లకురుమలకు రూ.31,500 వాటాధనం కడితే ఒక్కో యూనిట్‌ కింద రూ.1.25 లక్షలు గొర్రెలు ఇచ్చారని, గొర్రెలను సాదుకోలేక రూ.55 వేలకు అమ్ముకుంటే వారికి మిగిలింది రూ.13 వేలనుంచి రూ.18 వేల వరకే అన్నారు. మిగతా డబ్బులు ఎవరి పాలయ్యాయో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలు చేపట్టకుండా, కేవలం హుజూరాబాద్‌లోనే ఒక్క ఈటల రాజేందర్‌ను టార్గెట్‌ చేసి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. దళితబంధు దళితులపై ప్రేమతో కాదని, వారి ఓట్లను కొల్లగొట్టేందుకేనని ఈటల రాజేందర్‌ ఆరోపించారు.

Related posts

గులాబ్‌ తుఫాన్‌తో అపార నష్టం

Hardworkneverfail

దళిత బంధు అమలు చేయకపోతే.. ఉద్యమం తప్పదు : బండి సంజయ్ వార్నింగ్

Hardworkneverfail

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు షురూ

Hardworkneverfail

అతి భారీ వర్షాలతో అతలాకుతలమైన నిజామాబాద్‌ జిల్లా

Hardworkneverfail

Bandi Sanjay: ముగిసిన ప్రజా సంగ్రామ యాత్ర.. భావోద్వేగానికి గురైన బండి సంజయ్

Hardworkneverfail

NIA Conduct Search : తెలంగాణలో ఎన్ఐఏ అధికారుల సోదాలు..

Hardworkneverfail