తెలంగాణ : హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల గెలుపు ప్రజల గెలుపు అని అన్నారు. ఈటల రాజేందర్ పై ఎన్ని కుట్రలు చేసినా చివరికి తామే గెలిచామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల పేరుతో తప్పించుకున్నారని, దళిత బంధు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నిగ్ ఇచ్చారు. దళిత బంధు అమలు చేస్తామంటే, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేశారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు కూడా దళిత బంధు లాంటి పథకం తీసుకు రావాలని డిమాండ్ చేశారు.