Bright Telangana
Image default

హుజూరాబాద్, బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెర..

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ నియోజవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 30న పోలింగ్‌ నిర్వహణ నేపథ్యంలో 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంది. అయితే.. హుజూరాబాద్‌లో బుధవారం సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేసుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతినివ్వగా.. బద్వేల్ లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ప్రధాన పార్టీల నాయకులు మాటల తూటాలతో రాజకీయాలను వెడెక్కించారు. ఈ సాయంత్రం ప్రచారం పర్వం ముగియగానే.. ప్రలోభాల పర్వం మొదలుకానుంది.

హుజురాబాద్ ఉపఎన్నికల ప్రచార వేడి తారస్థాయికి చేరింది. ఈ ఉపఎన్నికలో గెల్చి, మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, ఈటల గెలుపుతో ఝలక్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. అయితే, చాపకింద నీరులా హస్తం పార్టీ ప్రచారం సాగుతోంది.

బద్వేల్‌ ఉపఎన్నిక ప్రచారానికి కూడా నేటితో తెరపడనుంది. ప్రచార పర్వంలో అధికార వైసీసీ, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాటల తూటాలతో వేడెక్కించారు. అధికార పార్టీ వైసీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరుపున పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, తదితర నాయకులు ప్రచారం నిర్వహించారు. కాగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పోటీ చేయడం లేదు.

Related posts

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

Hardworkneverfail

Huzurabad By Elections: హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపెవరిది..?

Hardworkneverfail

Bypoll Result: హుజురాబాద్‌, బద్వేల్‌లో మొదలైన ఓట్ల లెక్కింపు..

Hardworkneverfail

సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైంది: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Hardworkneverfail

Huzurabad By Election : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల రాజేందర్

Hardworkneverfail

Harish Rao: హ‌రీశ్ రావుకు ఆర్థిక శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ..

Hardworkneverfail