Bright Telangana
Image default

సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైంది: ఎమ్మెల్యే ఈటల రాజేందర్

etela rajender latest news

తెలంగాణ : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్నాచౌక్ నుంచే సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైందన్నారు. కేసీఆర్ పైరవీలు చేసుకున్న వాళ్లకే బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. రైతు రుణ మాఫీలో 24వేల కోట్లలో 5వేల కోట్లు కూడా చెల్లించలేదు. ఒకవేళ ఇచ్చినా డబ్బు కేవలం రైతుల వడ్డీ కట్టాడానికే సరి పోయింది. ఒక రైతుబంధు ఇచ్చి రైతులకు రావాల్సిన ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఫసల్‌ భీమా రాష్ర్ట వాటా కట్టలేదన్నారు. మీరిచ్చేది ఇస మెత్తు.. నష్టపోయేది అధికం. ఇప్పటికి కూరగాయాలు ఇంపోర్ట్‌ అవు తున్నాయి. కేసీఆర్‌ మంచిదయితే తనఖాతాలో వేసుకుంటాడు. చెడు అయితే మంది మీద తోస్తారు. 18 గంటలే కరెంటు ఇస్తున్నారు. పీక్‌ టైంలో ఐదు గంటలు కరెంటు ఇవ్వడం లేదు. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం చెప్పింది. రా రైస్‌ ఎంతైనా తీసుకుంటామని కేంద్రం చెప్పింది.

ఒక సీఎం స్థాయిలో ఉండి అడ్డమైన అబద్ధాలు అన్ని కేసీఆర్‌ ఆడుతున్నాడు. సీడ్‌ విషయంలో కూడా హర్టీ కల్చర్, పాలీహౌజ్‌లు వేసుకున్న రైతులు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. షాట్ మెమోరీ ప్రజలకు ఉండొచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారన్నారు. నువ్వు మాట్లాడిన మాటలన్నీ ప్రజలకు గుర్తుంటాయి. కోటి టన్నుల పంట పండే అవకాశం ఉందని గతంలో కేసీఆర్‌ చెప్పారు.

తన ముఖం అసెంబ్లీలో చూడకూడదనుకుంటే సీఎం‌ రాజీనామా చేయాలన్నారు. టీఆర్ఎస్‌లో ఏ ఒక్క నేత సంతృప్తిగా లేడని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. కేసీఅర్ తీరును ప్రజాస్వామ్యం అసహ్యించుకుంటోందన్నారు. వరి వేస్తే ఉరే అని మాట్లాడటం దుర్మార్గం, మూర్ఖత్వమన్నారు. ప్రతి గింజను రాష్ట్రమే కొంటుందని నిండు సభలో కేసీఆర్ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు.

Related posts

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

Hardworkneverfail

దళితబంధు పథకాన్ని కూడా కేసీఆర్‌ అటకెక్కిస్తారేమో.. డీకే అరుణ విమర్శలు..

Hardworkneverfail

అక్టోబర్ 30న హుజురాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం యుద్ధం : ఈటల

Hardworkneverfail

Rythu Bandhu : తెలంగాణ రైతుల‌కు శుభ‌వార్త‌.. డిసెంబర్ 15 నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

Hardworkneverfail

Huzurabad By Elections 2021 Live: హుజరాబాద్ గడ్డపై మొదలైన యుద్ధం..

Hardworkneverfail

Huzurabad By Elections: కమలాపూర్‌ మండలంలో టీఆర్‌ఎస్‌-బీజేపీ వర్గీయుల ఘర్షణ

Hardworkneverfail