Bright Telangana
Image default

T20 World Cup Final: నేడే టీ20 ప్రపంచకప్ ఫైనల్.. కివీస్‌-ఆసీస్‌ మధ్య ఫైనల్‌ పోరు

T20 World Cup Final

టీ 20 ప్రపంచ కప్ 2021: టీ20 ప్రపంచకప్‌ ముగింపు దశకు చేరింది. నేడే ఫైనల్‌. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ అంతిమ సమరానికి సర్వం సిద్ధమైంది. 2019 వన్డే వరల్డ్ కప్‎ ఫైనల్ ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్‌ ఈసారి టీ20 వరల్డ్ కప్ సాధించాలని పట్టుదలగా ఉంది. బౌలింగ్‌ విభాగంలో బలంగా ఉన్న న్యూజిలాండ్ ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో బ్యాటింగ్‌లోనూ సత్తాచాటింది. టిమ్‌ సోథి, ట్రెంట్‌ బౌల్ట్, ఆడమ్‌ మైనేలతో బలీయంగా ఉంది. లెగ్‌ స్మిన్నర్‌ ఐష్‌ సోథి బాగానే రాణిస్తున్నాడు. ఐసీసీ టోర్నీల్లో మెరుగ్గా ఆడుతున్నా.. తుదిపోరులో ఒత్తిడిని అధిగమించలేక తడబడడం న్యూజిలాండ్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

2010లో ఓసారి ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా ఈసారి అంచనాలకు మించే రాణించింది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఒకేసారి తలపడగా (2016లో) న్యూజిలాండ్‌ గెలిచింది. ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఒకేసారి (2015 వరల్డ్‌కప్‌) ఎదురుపడ్డాయి. ఆ సమయంలో ఆస్ట్రేలియా నెగ్గగా.. అప్పటి నుంచి ఈ జట్టు మరో టోర్నీ గెలవలేదు. అయితే ఇరుదేశాల అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించాలనుకుంటే తెల్లవారుజామునే మేల్కో వాల్సిందే.

ఓపెనర్ల ఆట కీలకం:

ఓవరాల్‌గా న్యూజిలాండ్‌ పై ఆధిక్యం కలిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఫించ్‌, వార్నర్‌ అందించే శుభారంభం కీలకం కానుంది. పాక్‌తో మ్యాచ్‌లో అఫ్రీది ఇన్‌స్వింగర్‌కు ఫించ్‌ తొలి ఓవర్‌లోనే వెనుదిరిగినా.. న్యూజిలాండ్‌పై ఫామ్‌ చూపిస్తుంటాడు. చివరి రెండు ఇన్నింగ్స్‌లో వార్నర్‌ అదరగొట్టాడు. ఇక ఫైనల్లోనూ అతడి బ్యాట్‌ గర్జిస్తే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవు. అయితే మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. డెత్‌ ఓవర్లలో చెలరేగేందుకు స్టొయినిస్‌, వేడ్‌ సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఇప్పటికే 12 వికెట్లు తీయగా.. ఎప్పటిలాగే మధ్య ఓవర్లలో న్యూజిలాండ్‌ బ్యాటర్స్‌ను కట్టడి చేయాలనుకుంటున్నాడు. ఇక పేస్‌ త్రయం స్టార్క్‌, కమిన్స్‌, హాజెల్‌వుడ్‌ తొలిసారిగా న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌ ఆడబోతున్నారు.

Related posts

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై నమీబియా విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: బంగ్లాదేశ్‌పై స్కాట్లాండ్‌ ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం … కేవలం 39 బంతుల్లో టార్గెట్ ఫినిష్

Hardworkneverfail

T20 World Cup 2021: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ విజయం..

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్‌‌ పై 130 పరుగుల భారీ తేడాతో అప్ఘానిస్తాన్ ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: ఇండియాపై పాకిస్థాన్‌ సంచలన విజయం..

Hardworkneverfail