Bright Telangana
Image default

T20 World Cup 2021: స్కాట్లాండ్‌ పై నమీబియా విజయం

టి20 ప్రపంచకప్‌ 2021 : స్కాట్లాండ్‌పై నమీబియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్‌లలో స్కాట్లాండ్‌ ఇచ్చిన 110 పరుగుల లక్ష్యాన్ని నమీబియా విజయవంతంగా చేధించింది మరియు టోర్నీలో నమీబియా తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. నమీబియా బ్యాట్స్‌మెన్స్‌లో విలియమ్స్‌ 23 పరుగులు, జేజే స్మిత్‌ 33 పరుగులతో రాణించడంతో విజయం సాధించగలిగారు. నమీబియా బ్యాట్స్‌మెన్స్‌లో లింగెన్‌ 18 పరుగులు, డేవిడ్‌ 16 పరగులతో జట్టు స్కోరు పెరగడంలో కీలక పాత్ర పోషించారు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్‌ ఆరంభం నుంచే తడబడింది. నమీబియా బౌలర్ల ధాటికి స్కాట్లాండ్‌ తొలి ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో ఆ మాత్రం స్కోరునైనా సాధించగలిగింది. స్కాట్లాండ్ బ్యాట్స్‌మెన్‌లో మైఖేల్ లియాస్క్‌ (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నమీబియా బౌలర్లలో ట్రంపుల్మన్‌ మూడు, జాన్‌ ఫ్రైలింక్ రెండు‌, డేవిడ్ వైస్‌, స్మిత్ చెరొక్క వికెట్ తీశారు.

Related posts

T20 World Cup 2021: శ్రీలంక పై ఇంగ్లండ్‌ ఘన విజయం..!

Hardworkneverfail

T20 World Cup Final: ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం..

Hardworkneverfail

T20 World Cup: ఫైనల్ లో ఆస్ట్రేలియా..పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం

Hardworkneverfail

T20 World Cup 2021: స్కాట్లాండ్ పై టీమిండియా ఘన విజయం … కేవలం 39 బంతుల్లో టార్గెట్ ఫినిష్

Hardworkneverfail

T20 World Cup 2021: వెస్టిండీస్‎పై ఆస్ట్రేలియా ఘన విజయం..

Hardworkneverfail

T20 World Cup 2021: 20 రన్స్ తేడాతో వెస్టిండీస్ పై శ్రీలంక గెలుపు..

Hardworkneverfail