Bright Telangana
Image default

భానుడి తీవ్రతకు ఉడుకుతున్న ఉత్తర తెలంగాణ ..

heat wave in telangana

Heat Wave in Telangana : భానుడి తీవ్రతకు మంగళవారం ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉడికిపోయాయి. నిర్మల్‌, జగిత్యాల జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 11 జిల్లాల్లో 44 డిగ్రీలపైన నమోదయ్యాయి. గ్రామాల్లో ప్రజలు బయటికి రావాలంటే భయపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు కొంత ఉపశమనం లభించవచ్చని, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలలోపే నమోదుకు అవకాశం ఉందని తెలిపింది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో గులాబ్‌సింగ్‌(50) అనే చిరువ్యాపారి, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం పులిమడుగులో పరమేశ్వరి(17) మంగళవారం, కుమురంభీం-ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి ఇబ్రహీం(35) సోమవారం రాత్రి వడదెబ్బతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.