ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూ : హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయంతో అధికార టీఆర్ఎస్‌కు దిమ్మతిరిగేలా చేశారు బీజేపీ నేత ఈటల రాజేందర్. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. కానీ, ఈటల చరిష్మా ముందు అవన్నీ దిగదుడుపుగానే మిగిలిపోయాయి. ఈటలకు ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టారు. అధికార పక్షాన్ని కాదని తనపై నమ్మకంతో ప్రజలు తనను ఎమ్మేల్యేగా ఎన్నుకున్నారని చెప్పారాయన.
సీఎం కేసీఆర్ శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా హింస పెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు. అయినా ప్రజలు ఇచ్చిన తీర్పు ఉత్సాహపర్చిందన్నారు. ‘‘వందల మంది పోలీసులను మఫ్టీలో హుజూరాబాద్‌లో దింపారు. ఒక్కో కుటుంబానికి ఏం అవసరం ఉంది, బలహీనత ఉంది. భూమి సమస్య ఉంటే పరిష్కరించడం చేశారు’’ అని ఈటల రాజేందర్ చెప్పారు. ఇలా పలు ఆసక్తికర విషయాలను ఏబీఎన్ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.