Bright Telangana
Image default

బండి సంజయ్‌ : వానాకాలం పంట కొంటారా? కొనరా?

bandi sanjay padayatra live today

తెలంగాణ : వానాకాలంలో రైతులు పండించిన పంట కొనుగోలు చేస్తారా? లేదా? అన్న దానిపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమంలోనే కేసీఆర్‌ దీక్ష చేయలేదని, ఇప్పుడేం ధర్నాలు చేస్తారని ఎద్దేవా చేశారు. ఒకవేళ కేసీఆర్‌ ధర్నాలు చేసినా టైం పాస్‌కే చేస్తారంటూ వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడినపుడు బండి సంజయ్‌ పలు అంశాలపై మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌కు కూడా ఈడీ భయం పట్టుకుందని, సానుభూతి కోసమే ప్రెస్‌మీట్‌లు పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్, టీఆర్‌ఎస్‌ లేవనెత్తిన అంశాలన్నింటికీ తాము సమాధానాలు చెప్పామని, అయినా సీఎం కేసీఆర్‌ ఎందుకు మాట్లడడం లేదని ప్రశ్నించారు. తాము పంటల మార్పిడికి వ్యతిరేకం కాదని, ముందస్తుగా దీనిపై రైతులకు అవగాహన కల్పించి పంట మార్పిడికి సంసిద్ధం చేయాలని బండి సంజయ్‌ సూచించారు. ఓ వైపు రైతులు కల్లాలు, రోడ్లు, మార్కెట్ల వద్ద ధాన్యం పెట్టుకొని అమ్ముకోలేక ఆందోళనలో ఉంటే.. అధికారంలో ఉండి టీఆర్‌ఎస్‌ వాళ్లు సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ధర్నాకు వచ్చిన వారే కేసీఆర్‌ డౌన్‌డౌన్‌ అంటున్నారని వాళ్లకు వాస్తవ విషయాలు తెలిసినట్లు లేదన్నారు.

Related posts

Two notices to Raja Singh: రెండు నోటీసులు.. ఇన్నిరోజులు పోలీసులు నిద్రపోతున్నారా? రాజాసింగ్ ఆగ్రహం

Hardworkneverfail

Gun Fire : అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Hardworkneverfail

Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు

Hardworkneverfail

సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఇస్తాం: మంత్రి హరీష్ రావు

Hardworkneverfail

CM KCR : తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గించం .. తేల్చిచెప్పిన కేసీఆర్‌

Hardworkneverfail

High Court of Telangana : బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతి

Hardworkneverfail