Bright Telangana
Image default

God Father : ఓటీటీలో దుమ్ములేపుతున్న మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ మూవీ..!

god father ott update

Megastar Chiranjeevi GodFather Movie Rampage on Netflix : మెగాస్టార్ చిరంజీవి నటించిన మూవీ ‘గాడ్‌ఫాదర్’ దసరా కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీని దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, నయనతార మరో ముఖ్య పాత్రలో నటించింది. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కించింది మూవీ యూనిట్. ఇక థియేటర్స్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫాం స్ట్రీమింగ్ చేస్తోంది.

అయితే ‘గాడ్‌ఫాదర్’ మూవీ ఓటీటీలోకి వచ్చి కూడా చాలా రోజులు అవుతోంది. అయినా కూడా మెగాస్టార్ తన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీతో ఓటీటీలో హల్‌చల్ చేస్తున్నారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ లో ఇంకా 8వ స్థానంలో కొనసాగుతుండటం నిజంగా విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఈ మూవీలో కేమియో పాత్రలో నటించగా, మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్‌తో పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఈ మూవీకి థమన్ సంగీతం అందించగా, ఈ మూవీలో సత్యదేవ్, సునీల్, సముథ్రఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాయి. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’తో సంక్రాంతి బరిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు.

Related posts

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Waltair Veerayya : ఈ పాట ఎలివేషన్స్ కా బాప్..

Hardworkneverfail

Megastar Chiranjeevi: మెగాస్టార్ నోట ‘రంగ మార్తాండ’ షాయరీ

Hardworkneverfail

God Father Movie Review : తలరాతనే కాదు.. సినిమా రాతను మార్చేసిన బ్రహ్మ.. ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ..

Hardworkneverfail

GodFather Movie: గాడ్‌ఫాదర్‌ మూవీలో చిరంజీవికి తల్లిగా గంగవ్వ ?

Hardworkneverfail

Sankranthi Movies : మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి రాజకీయ సెగ!

Hardworkneverfail