Bright Telangana
Image default

Sankranthi Movies : మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి రాజకీయ సెగ!

Megastar Chiranjeevi'waltair veerayya' movie is a political segue!

Sankranthi Movies : ఈ సంక్రాంతి సంబరం బాగా వేడిమిని పుట్టించనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. ఈ సారి సంక్రాంతి మూవీస్ చుట్టూ రాజకీయ వాతావరణం చోటు చేసుకోనుందని మూవీ లవర్స్ వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈ సంక్రాంతి పండగకు మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ , నందమూరి నటసింహం బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ మూవీస్ పోటీకి సై అంటూ కాలు దువ్వుతున్నాయి.

ఈ రెండు మూవీస్ సంక్రాంతికే విడుదలవుతుండడంతో ఇరువర్గాల అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తాజా మూవీ ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి యూరప్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో మెగాస్టార్ తో పాటు శృతిహాసన్ పాల్గొంటోంది.

కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలోనే తెరకెక్కుతోన్న ఇంకో మూవీ ‘వీర సింహా రెడ్డి’. బాలకృష్ణ హీరోగా ఈ మూవీ నిర్మితమవుతున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు మూవీస్ లో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం. రెండూ సంక్రాంతికే విడుదలవుతున్నాయి. ఈ రెండు మూవీస్ పబ్లిసిటీ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు కత్తి మీద సాము లాంటిదే. నందమూరి బాలకృష్ణ మూవీకి ఎలాగూ టీడీపీ నుంచి సపోర్ట్ లభిస్తుంది. అదే టీడీపీ నుంచి ‘వాల్తేరు వీరయ్య’ మూవీకి నెగెటివిటీ తప్పదు.

ఇంకోపక్క, వైసీపీ నుంచి ‘వాల్తేరు వీరయ్య’(Waltair Veerayya) మూవీపై నెగెటివిటీ కనిపిస్తోంది. జనసేన నుంచి ‘వాల్తేరు వీరయ్య’కు పాజిటివిటీ వుండడం మామూలే. వెరసి, సంక్రాంతి సినిమాల చుట్టూ చాలా రాజకీయమే వుండబోతోంది. నెగెటివిటీని ఎదుర్కోవడం చిరంజీవికి కొత్త కాదు. కానీ, ‘ఆచార్య’ మూవీ విషయంలో ఆ నెగెటివిటీ కొంప ముంచిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ విషయంలో నెగెటివిటీ ఏ మాత్రం పనిచేయలేదు. ‘వాల్తేరు వీరయ్య’ మూవీ పై నెగెటివిటీని, ఫ్రీ పబ్లిసిటీగా మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటున్నారట. బోల్డంత ఖర్చు చేసి, మూవీ పై నెగెటివిటీ కోసం ఓ వర్గం ప్రయత్నిస్తోందని మెగా కంపౌండ్ విశ్వసిస్తోంది. మరి ఈ సంక్రాంతి పోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే!

Related posts

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్‌.. పూనకాలు లోడింగ్‌ అంటే ఇదేనేమో!

Hardworkneverfail

God Father : ఓటీటీలో దుమ్ములేపుతున్న మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ మూవీ..!

Hardworkneverfail

Acharya Movie Postponed : ‘ఆచార్య’ విడుదల వాయిదా..

Hardworkneverfail

Acharya Trailer : ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ మామూలుగా లేదుగా..

Hardworkneverfail

God Father Movie Review : తలరాతనే కాదు.. సినిమా రాతను మార్చేసిన బ్రహ్మ.. ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ..

Hardworkneverfail

Boss Party Song : భలేగా ‘వాల్తేరు వీరయ్య’ ‘బాస్ పార్టీ’సాంగ్ !

Hardworkneverfail