Bright Telangana
Image default

Boss Party Song : భలేగా ‘వాల్తేరు వీరయ్య’ ‘బాస్ పార్టీ’సాంగ్ !

Boss Party Song

Boss Party Song From Waltair Veerayya Movie : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ లోని తొలి సింగిల్ సాంగ్ ‘బాస్ పార్టీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు మూవీ మేకర్స్ తాజాగా ఈ పాటను రిలీజ్ చేశారు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వాల్తేరు వీరయ్యగా ఊరమాస్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపిస్తుండటంతో ఈ మూవీ కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

ఇక ఈ మూవీలోని ఊరమాస్ పాట ‘బాస్ పార్టీ’ (Boss Party Song) లిరికల్ వీడియోని బుధవారం విడుదల చేశారు మూవీ మేకర్స్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌లో చిరంజీవి తనదైన స్వాగ్ మూమెంట్స్‌తో అదరగొట్టాడు. మెగాస్టార్ డ్యాన్స్‌లో గ్రేస్ ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉండటంతో అభిమానులు ఈ పాటను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ కూడా సూపర్‌గా ఉండటంతో ఈ పాట ఫ్యాన్స్‌కు పిచ్చపిచ్చగా ఎక్కేసింది.

కాగా, ఈ సాంగ్‌లో చిరంజీవితో పాటు బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కూడా చిందులు వేయడంతో, ఈ జంట వేసిన స్టెప్స్‌ను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట వాల్తేరు వీరయ్య మూవీకే హైలైట్‌గా ఉంటుందని, ఇక ఈ సాంగ్‌లో మెగాస్టార్ స్వాగ్ మూమెంట్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న వాల్తేరు వీరయ్య మూవీలో మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, సంక్రాంతి బరిలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్.

Related posts

Waltair Veerayya : ఈ పాట ఎలివేషన్స్ కా బాప్..

Hardworkneverfail

Pushpa Trailer update: అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ట్రైలర్ వచ్చేది ఆ రోజే..!

Hardworkneverfail

Pushpa : పుష్ప మూవీ నుంచి మరో మాస్ సింగిల్..

Hardworkneverfail

Acharya Trailer : ‘ఆచార్య’ మూవీ ట్రైలర్ మామూలుగా లేదుగా..

Hardworkneverfail

Acharya Movie: ‘ఆచార్య’ మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail