సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జు్న్… రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీలో బన్నీ పుష్పరాజ్‌గా.. రష్మిక శ్రీవల్లి పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో అదరగొట్టాయి. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సామీ సామీ సాంగ్ సౌత్ ఇండియాలోనే సరికొత్తగా రికార్డ్ సృష్టిస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన దాక్కో దాక్కో మేక పాట సైతం యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది.
ఇక ఇటీవల విడుదలైన సామీ సామీ సాంగ్ అతి తక్కువ సమయంలోనే 30 మిలియన్స్ క్లబ్ లో చేరబోతోంది. ఇందులోని బన్నీ, రష్మిక స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది. వరుస బ్లాక్‌బస్టర్ మూవీలతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్థ ముత్తంశెట్టి మీడియాతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు.