Manchu Manoj: మంచు మనోజ్ లేకుంటే మా ఎన్నికల పోలింగ్ సమయంలో కొట్టుకుని ఉండేవారని, పరిస్థితి దారుణంగా తయారయ్యేదని కూడా ప్రకాష్ రాజ్ ప్యానెల్ చెప్పింది. మంచు మనోజ్.. ఎప్పుడూ కూడా కాస్త సామరస్య వాతావరణం క్రియేట్ చెయ్యాలనే ఆలోచనతో ఉండేవారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల టైమ్‌లో ప్రకాష్ రాజ్, విష్ణు కలిసిపోయారంటూ కూడా ట్వీట్ చేశారు.
లేటెస్ట్‌గా మా గొడవలపై రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. మా అసోసియేషన్ ఓ సర్కస్ అని, సభ్యులంతా జోకర్లు అంటూ చేసిన ట్వీట్‌పై.. సార్, మీరు రింగ్ మాస్టర్.. అంటూ పంచ్ వేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
And you are the Ring Master sir 🙌🏽 https://t.co/gW8VaFhwdb
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 19, 2021