Bright Telangana
Image default

Kondagattu : కొండగట్టు ఆంజనేయస్వామి గుడి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌..

Kondagattu Hanuman temple

Kondagattu Hanuman temple : పూర్వపు కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండున్నర నెలల వ్యవధిలో దానిని సిద్ధం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అందుకు సరిపడా అక్కడ వసతులు లేవు. రహదారులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి.

ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల ఆలయాన్ని సందర్శించి మరింతగా అభివృద్ధి చేసేందుకు రూ.600 కోట్లైనా ఖర్చు చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఎక్కడెక్కడ ఏం నిర్మించాలన్న విషయమై మార్గనిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో గుట్ట అభివృద్ధికి పూర్తిస్థాయి మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పనకు కసరత్తు చేపట్టారు. అది కొలిక్కి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఎంత వ్యయం అవుతుందో అంచనా వేయాలని అధికారులు నిర్ణయించారు. ఆలయం చుట్టూ ఉన్న సుమారు రెండున్నర నుంచి మూడు వేల ఎకరాల అటవీ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ప్రధాన ఆలయ విస్తరణ, వివిధ ఆలయాలు, కల్యాణమండపం నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధమవుతోంది.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి కూడా ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే ప్రక్రియ పూర్తి అయిన తర్వాత అందుకు సంబంధించిన కసరత్తు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ), వేములవాడ ఆలయ అభివృద్ధి సంస్థ (వీటీడీఏ)ల మాదిరిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా అభివృద్ధి విషయంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించింది.

యాదాద్రి విషయంలో ఆ సమన్వయం ఫలితాన్ని ఇచ్చినట్లు అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. అందుకు తగినట్లు ప్రణాళిక సాగుతోంది. రెండు నుంచి మూడు నెలల్లో సిద్ధమవుతుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తాం. నిధుల సమస్య లేదు. శాశ్వత ప్రాతిపదికన నీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక సాగుతోంది. గుట్ట చూట్టూ అడవి విస్తరించి ఉండటం ఆలయానికి మరింత వన్నె తెస్తుంది. గుట్టపైన కూడా పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కలను అభివృద్ధి చేస్తాం. అడవికి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన సాగుతుంది.

Related posts

బండి సంజయ్‌ : వానాకాలం పంట కొంటారా? కొనరా?

Hardworkneverfail

Ayyappa Devotees Protest : రాజేశ్‎ను తమకు అప్పగించాలని అయ్యప్ప స్వాముల ఆందోళన

Hardworkneverfail

హిమాన్షుపై వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న.. కేసు పెట్టిన కేటిఆర్…!

Hardworkneverfail

CM KCR: రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేస్తే.. ఊరుకోం.. పోరాడతాం.. సీఎం కేసీఆర్

Hardworkneverfail

CM KCR: ఢిల్లీలో సీఎం కేసీఆర్.. నేడు ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులతో భేటీ

Hardworkneverfail

BJP Nirudyoga Deeksha : బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ

Hardworkneverfail