Bright Telangana
Image default

Pushpa : పుష్ప మూవీ నుంచి మరో మాస్ సింగిల్..

pushpa movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”పాటలు కూడా విడుదలై అదరగొడుతుండగా ఇక మరో పాటను విడుదల చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అయ్యింది. ఈసారి కూడా ఇంకో పక్కా మాస్ నెంబర్ ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ పాటకోసం ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ లాంచ్ చేసిన కొత్త పోస్టర్ అల్లు అర్జున్ లుక్ అదిరింది.ఈ నాల్గవ సాంగ్ ని నవంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది మూవీ యూనిట్. 1000 మందికి పైగా డ్యాన్సర్లతో భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ సాంగ్ థియేటర్లలో దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ మూవీ డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

Related posts

Chiranjeevi: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

Hardworkneverfail

RRR Release Date: ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Hardworkneverfail

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన పెళ్ళిసందD

Hardworkneverfail

Acharya: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘ఆచార్య’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail