Bright Telangana
Image default

Chiranjeevi: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన

మెగాస్టార్‌ చిరంజీవి యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివతో చేస్తోన్న ‘ఆచార్య’ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత జయం రాజా దర్శకత్వంలో ‘లూసీఫర్‌’ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’, మెహర్‌ రమేశ్‌ డైరెక్షన్‌లో ‘భోళాశంకర్‌’ మూవీస్ లోను నటిస్తున్నారు. ఇటీవల బాబీ దర్శకత్వంలో మరో మూవీనీ కూడా పట్టాలెక్కించారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లోనూ మెగాస్టార్‌ చిరంజీవి నటించేందుకు రంగం సిద్ధమైంది. ఇంతకు ముందు చిరంజీవి ‘జై చిరంజీవా’ మూవీ కోసం త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ అందులోని కామెడీని ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి నటించే మూవీకి సన్నాహాలు జరుగుతున్నట్టు టాక్. గతంలో పలుమార్లు ఈ కాంబో మూవీపై ప్రయత్నాలు జరిగినప్పటికీ.. ఎట్టకేలకు ఈ ప్రాజక్టు ఓకే అయినట్టు తెలుస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను తెరకెక్కిస్తోన్న డీవీవీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ అధినేత డీవీవీ దానయ్య మెగాస్టార్‌- త్రివిక్రమ్‌ కాంబోను పట్టాలెక్కించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. చిరంజీవి ప్రస్తుతం వరుస మూవీస్ తో బిజీగా ఉండగా.. త్రివిక్రమ్ తన తదుపరి మూవీనీ మహేశ్ బాబుతో తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు, డిసెంబర్ సినిమాను లాంఛ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ లెక్కన చూస్తే.. మెగా, త్రివిక్రమ్ కాంబో పట్టాలెక్కడానికి మరింత టైమ్ పట్టవచ్చు. అంతవరకూ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడాల్సిందే.

Related posts

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ప్రకాశ్‌రాజ్‌

Hardworkneverfail

Shekar Movie : రాజశేఖర్ ‘శేఖర్‌’ మూవీకి ఓటీటీ నుండి వస్తున్న ఆఫర్స్ ..!

Hardworkneverfail

RRR Movie : ఆర్ఆర్ఆర్ నుంచి జనని సాంగ్ వచ్చేసింది.. మూవీ మొత్తానికి సోల్ ఈ పాట..

Hardworkneverfail

Actor Nani Sensational Comments : థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ..

Hardworkneverfail

Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌..

Hardworkneverfail

Pushpaka Vimanam: ఫస్ట్ డే కలెక్షన్స్..క్యాష్ చేసుకోలేకపోయిన ‘పుష్పక విమానం’

Hardworkneverfail