Bright Telangana
Image default

Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌..

dulquer salmaan kurup

మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ ‘మహానటి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ఈ క్రేజ్‌తోనే తను హీరోగా నటించిన మలయాళ మూవీలు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘కురుప్‌’ నవంబరు 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ని విడుదల చేశారు. కేరళకు చెందిన ఒకప్పటి మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్‌ జీవితాధారంగా తెరకెక్కుతోంది. కురుప్‌, గోపీకృష్ణన్‌ అనే రెండు విభిన్న కోణాల్లో దుల్కర్‌ కనిపించారు. తన నటనతో అందరికీ కట్టిపడేసేలా ఉన్నారు. క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు, వాటి నుంచి తప్పించుకునేందుకు కురుప్‌ వేసే ప్లాన్లతో ట్రైలర్‌ ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

మరి గోపీకృష్ణన్‌.. కురుప్‌గా ఎందుకు మారాడు? పరిస్థితుల ప్రభావమా? పోలీసులు ఆయన్ను పట్టుకున్నారా? అసలు సుకుమార కురుప్‌ జీవితం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ కీలక పాత్రలు పోషించారు. సంగీతం: సుషిన్‌ శ్యామ్‌, ఛాయాగ్రహణం: నిమిష్‌ రవి. ఈ మూవీ మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలకానుంది.

Related posts

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Kamal Haasan: విక్రమ్‌ వచ్చేశాడు.. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టిన కమల్‌ హాసన్‌

Hardworkneverfail

Peddanna : రజినీకాంత్ ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది!

Hardworkneverfail

పునీత్ రాజ్‌కుమార్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Hardworkneverfail

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail