Bright Telangana
Image default

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

samantha special song with allu arjun in pushpa movie

ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అంటే వీరు మాత్రమే చేయాలి అని ఉండేది. కానీ, ఇప్పుడు అలా కాదు. స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ కి హీరోలతో కాలు కదుపుతున్నారు. కాజల్, శృతి హాసన్, తమన్నా ఇలా వీరందరూ స్పెషల్ సాంగ్స్ లో కనువిందు చేసినవారే. మూవీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్‌ సమంత ఐటెమ్‌ సాంగ్‌ చేయబోతుంది. అది కూడా అల్లు అర్జున్ లాంటి అద్బుతమైన డాన్సర్‌తో కలిసి స్టెప్పులేయబోతుంది. సుకుమార్‌ – దేవిశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో వచ్చే ఐటెమ్‌ నెంబర్‌ అంటే అది ఆ మూవీకే స్పెషల్‌గా నిలుస్తుంది. ఐటెమ్‌ సాంగ్‌ల్లో అదొక టాప్‌ ట్రెండింగ్‌ సాంగ్‌గా నిలుస్తుంది. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపబోతున్నారు. సమంతతో ఐటెమ్‌ సాంగ్‌ చేయించబోతున్నారు సుకుమార్‌. అల్లు అర్జున్ తో కలిసి సమంతని ఈ స్పెషల్‌ నెంబర్‌ చేయించబోతుండటం విశేషం. దీంతో ఇప్పుడీ విషయం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌తోపాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

తాజాగా ‘పుష్ప’ మూవీ కోసం అమ్మడు ఒక స్టెప్ ముందుకేసింది. ఎప్పటినుంచో అనుకున్నట్టుగానే పుష్ప రాజ్ తో సామ్ కాలు కదపనుంది. ఇక ఈ విషయాన్ని పుష్ప మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. అల్లు అర్జున్–సుకుమార్‌– డీఎస్‌పీ కాంబినేషన్‌ లో వస్తున్న ‘పుష్ప’ మూవీలో ఐటెమ్‌ సాంగ్‌ లో నటించానికి సమంత అంగీకరించినట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ నెల చివర్లో ఈ సాంగ్ షూట్ ఉండనుంది. మరి సమంత, అల్లు అర్జున్ తో కలిసి మాస్ స్టెప్పులతో ఇరగదీస్తుందేమో చూడాలి.

Related posts

Mega 154 Update: ఊర మాస్ అవతార్…మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

Hardworkneverfail

ఓటీటీలోకి బాలయ్య ఎంట్రీ.. టాక్‌ షోతో రచ్చ రచ్చే

Hardworkneverfail

సమంత ‘నువ్వు నా హృదయాన్ని గెలుచుకున్నావు, నా గౌరవాన్ని గెలుచుకున్నావు’ .. అల్లు అర్జున్

Hardworkneverfail

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి క‌న్నుమూత..

Hardworkneverfail

Pushpa Trailer : తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్.. ‘పుష్ప’ మూవీ ట్రైలర్

Hardworkneverfail

పునీత్ రాజ్‌కుమార్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

Hardworkneverfail