Bright Telangana
Image default

Mega 154 Update: ఊర మాస్ అవతార్…మాస్‌ లుక్‌లో మెగాస్టార్‌ చిరంజీవి

chiranjeevi 154 movie

మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ చిత్రాన్ని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి మూవీలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా మెగా 154వ ప్రాజెక్ట్ ని షురూ చేశారు. బాబీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం శనివారం వేడుకగా జరిగింది. చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా బాబీ.. చిరు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో చిరంజీవి మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ ట్రెండ్‌ అవుతోంది. చిరంజీవి లుక్‌ చూసి అభిమానులు ఈలలు వేస్తున్నారు. ‘మాస్‌ పూనకాలు మొదలాయే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్‌ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Related posts

పెద్దరికం నాకు వద్దు.. ఇద్ద‌రు కొట్టుకుంటుంటే ఆప‌డానికి రాను : చిరంజీవి

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన పెళ్ళిసందD

Hardworkneverfail

Maha Samudram Closing Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మహా సముద్రం’

Hardworkneverfail

Megastar Chiranjeevi: చిరంజీవి కుడి చేతికి సర్జరీ

Hardworkneverfail

Samantha: నాకు ఎవరితోనూ ఎఫైర్స్‌ లేవు.. అవన్నీ రూమర్స్‌: సమంత

Hardworkneverfail

Mega 154 : మెగాస్టార్‏తో మాస్ మాహారాజా.. షూటింగ్‏లో రవితేజ.. వీడియో అదిరిపోయిందిగా..

Hardworkneverfail