Bright Telangana
Image default

Pushpa Trailer : తగ్గేదేలే అంటున్న పుష్ప రాజ్.. ‘పుష్ప’ మూవీ ట్రైలర్

Pushpa Official Trailer

Pushpa Movie Trailer Telugu : కొన్ని ఊహించని టెక్నీకల్ ఇష్యూస్ వలన ట్రైలర్ ఆలస్యం అయ్యిందని చెప్పినా ఎట్టకేలకు ట్రైలర్ ని విడుదల చేశారు మూవీ యూనిట్. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ మూవీని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా.. శ్రీవల్లి, దాక్కొ.. దాక్కో మేక, సామి సామి, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్స్ కూడా విడుదలై అదరగొడుతుండగా.. ఈ మూవీ ట్రైలర్ కోసం బన్నీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఇక ఆరోజు రానే వచ్చింది.

కొద్దిసేపటి క్రితమే ‘పుష్ప’ మూవీ ట్రైలర్(Pushpa Movie Trailer) ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఈ ట్రైలర్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా కనిపిస్తోంది. ట్రైలర్ లో పుష్ప రాజ్ ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకొంటుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తగ్గేదేలే అన్నట్లుగా వుంది. వచ్చేనెల 12వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు చెన్నై, కొచ్చి, ముంబై నగరాల్లో కూడా ఈవెంట్‌లను ప్లాన్ చేస్తోందట మూవీ యూనిట్.

ఈ పాన్ ఇండియన్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. ‘పుష్ప ది రైజ్ పార్ట్ 1’ ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Related posts

Pushpa Movie Collections : ‘పుష్ప’ మూవీ 15 డేస్ కలెక్షన్స్..

Hardworkneverfail

Samantha: సమంత ఐటెంసాంగ్.. ‘పుష్ప’ టీమ్‌ అఫీషియల్‌ అనౌన్స్ మెంట్‌

Hardworkneverfail

Boss Party Song : భలేగా ‘వాల్తేరు వీరయ్య’ ‘బాస్ పార్టీ’సాంగ్ !

Hardworkneverfail

Sai Dharam Tej: మెగా హీరోల దీపావళి సందడి.. హాజరైన సాయి ధరమ్ తేజ్..

Hardworkneverfail

Pushpa Songs : ‘పుష్ప’ నుంచి ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ .. వీడియో సాంగ్ వచ్చేసింది..

Hardworkneverfail

Pushpa Fourth Single: ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

Hardworkneverfail