ఇప్పటికే నాగార్జున , తారక్ బుల్లి తెరపై దుమ్మురేపుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలకృష్ణ పేరు చేరింది. ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే ఆలోచించే నందమూరి బాలకృష్ణ.. ఫర్ ది ఫస్ట్ టైమ్ ఓటీటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆహా కోసం అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహించబోతున్నారు బాలకృష్ణ. ఈ షోకు మంచు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ అతిథిలుగా వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. గురువారం ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలను అల్లు అరవింద్ ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో చిరంజీవి, ఆయన కుమారు రామ్ చరణ్ పాల్గొంటారని, అలాగే ఆరంభ ఎపిసోడ్ లో మోహన్ బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ పార్టిసిపేట్ చేశారని వినిపిస్తోంది. అలాగే నాగార్జున, ఆయన కుమారులతోనూ ఈ టాక్ షో ఉంటుందట.
Aayana adugesi, Show modaledithe…
— ahavideoIN (@ahavideoIN) October 10, 2021
The Baap of all talk shows is here! 💥
Get ready for the Paisa Vasool entertainment.🤑#NBKonAHA pic.twitter.com/bPExyZ0Fbd