Bright Telangana
Image default

Kaikala Satyanarayana: అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

Actor Kaikala Health Condition Critical

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అపోలో ఆస్పత్రిలో గత రెండ్రోజులుగా చికిత్స పొందుతున్నారు. తాజాగా అపోలో వైద్యులు కైకాల హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌ మీదే ఉన్నారని.. ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదని చెప్పుకొచ్చారు. వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. కైకాల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌‌పై చికిత్స జరుగుతోంది. బీపీ లెవల్స్‌ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందంటూ ఓ ప్రకటన విడుదల చేసారు అపోలో వైద్యులు.

60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల సత్యనారాయణ ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 మూవీస్ ల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్ధిస్తున్నారు.

Related posts

Bangarraju Teaser : నవ ‘మన్మథుడు’ వచ్చాడు.. ‘చిన్న బంగార్రాజు’ గా నాగ చైతన్య..

Hardworkneverfail

‘అంకుల్ మూవీ అద్భుతంగా ఉంది’ అన్నారు.. అలా అనడం నాకు నచ్చలేదు : బాలకృష్ణ

Hardworkneverfail

‘సిరివెన్నెల’ మనకి ఇక లేడు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు : చిరంజీవి

Hardworkneverfail

Vijay Sethupathi: విజయ్ సేతుపతిపై ఎయిర్‌పోర్టులో దాడి..?

Hardworkneverfail

Actor Nani Sensational Comments : థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ..

Hardworkneverfail

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్..IMDB రేటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో..

Hardworkneverfail