Bright Telangana
Image default

Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్..IMDB రేటింగ్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో..

jai bhim movie set new record

ఇప్పుడు ఎక్కడ విన్నా జై భీమ్ మూవీ గురించే వినిపిస్తుంది. తమిళ హీరో సూర్య నటించిన ఈ మూవీ ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ మూవీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఒక మూవీ కాదు.. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన దీన విజయగాధ. ఈ మూవీ చూసిన ప్రముఖులు సైతం దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో లాయర్ చంద్రూగా సూర్య నటన హైలెట్. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లు నటించారనే కంటే ఆయా పాత్రలో లీనమై జీవించారు. అందుకే ఈ మూవీకి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.

తాజాగా ఈ మూవీ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ IMDB (Internet Movie Data Base) మూవీల జాబితాలో ‘జై భీమ్‌’ టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపుగా 26 ఏళ్ల తరవాత ఈ రికార్డు తిరగరాయడం విశేషం.

ఇప్పటివరకు ఐఎండీబీ మూవీల జాబితాలో తొలిస్థానంలో 1994లో విడుదలైన ‘ది షాషాంక్ రిడంప్షన్’ మూవీకి ఉంది. కాగా, ఇప్పుడు ఆ మూవీను జై భీమ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌తో జై భీమ్ మొదటి స్థానంలో నిలవగా ‘ది షాషాంక్ రిడంప్షన్’ రెండవ స్థానానికి పడిపోయింది.

Related posts

Samantha: నాకు ఎవరితోనూ ఎఫైర్స్‌ లేవు.. అవన్నీ రూమర్స్‌: సమంత

Hardworkneverfail

Mega 154 Pooja Ceremony : మెగాస్టార్‌ కోసం స్టార్ డైరెక్టర్స్ తరలి వచ్చారు

Hardworkneverfail

Akhanda Trailer: ‘అఖండ’ ట్రైలర్.. అఘోరగా బాలయ్య నట విశ్వరూపం..

Hardworkneverfail

Shyam Singha Roy: భారీ మొత్తానికి అమ్ముడైన శ్యామ్ సింగ రాయ్ హిందీ రైట్స్

Hardworkneverfail

Dulquer Salmaan: ఉత్కంఠభరితంగా ‘కురుప్‌’ ట్రైలర్‌..

Hardworkneverfail

Samantha: సమంతకు ఊరట.. ఆ వీడియోలు వెంటనే తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు..

Hardworkneverfail