Bright Telangana
Image default

‘అంకుల్ మూవీ అద్భుతంగా ఉంది’ అన్నారు.. అలా అనడం నాకు నచ్చలేదు : బాలకృష్ణ

Akhanda Movie success meet

Akhanda Movie Success Meet : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’కు అన్ని చోట్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. బాలకృష్ణతో పాటు మూవీ యూనిట్ ఏఎంబి సినిమాస్‌ లో ‘అఖండ’ను వీక్షించింది. అద్భుతమైన ప్రతిస్పందనకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తదనాన్ని వారు ఆదరిస్తారని ఈ మూవీ మరోమారు రుజువు చేసిందన్నారు. పిల్లలకు కూడా ఈ మూవీ బాగా నచ్చిందన్న ఆయన.. వారు తన దగ్గరికి వచ్చి ‘అంకుల్.. ఈ మూవీ అద్భుతంగా ఉంది’ అన్నారని, వారికి మూవీ అంతగా నచ్చడం బాగున్నా తనను అంకుల్ అనడమే బాగోలేదని చమత్కరించారు. తెరపై నా నటన చూసి నేను కూడా కాస్త ఆశ్చర్యపోయాను. థమన్ తన రీరికార్డింగ్‌ తో మూవీకి ప్రాణం పోశాడు. ఈ మూవీ కోసం చాలా రీసెర్చ్ చేశాం. నేను దర్శకుడి ఆర్టిస్ట్‌ని. నేను కేవలం నా దర్శకుడి సూచనలను పాటిస్తాను. నాకు ప్రతి మూవీ సమానమే” అని అన్నారు.

బోయపాటి మాట్లాడుతూ అఖండ సూపర్ డూపర్ హిట్ అని అందరూ ఏకగ్రీవంగా చెబుతున్నారు. ఈ మూవీ సెకండ్ వేవ్ తర్వాత వచ్చింది. చాలా కాలం తర్వాత థియేటర్‌లో భారీ వేడుకలు చూశాను. ఈ అఖండ విజయం ఇండస్ట్రీ విజయం అని అన్నారు.

Related posts

మెగాస్టార్ చిరంజీవి మూవీలో సల్మాన్‌ఖాన్‌.. బ్రిట్నీ స్పియర్స్‌తో అదిరిపోయే పాట

Hardworkneverfail

Shyam Singha Roy : నాని మూవీ టీజర్ ఎప్పుడంటే..

Hardworkneverfail

Akhanda, Shyam Singha Roy in Ott : ఓటీటీలోకి వచ్చేసిన ‘అఖండ’, ‘శ్యామ్ సింగ రాయ్’

Hardworkneverfail

Skylab Movie : ఆసక్తి రేపుతోన్న నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌ ‘స్కైలాబ్’ ట్రైలర్

Hardworkneverfail

Peddanna : రజినీకాంత్ ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది!

Hardworkneverfail

సల్మాన్ ఖాన్ అభిమానుల పిచ్చి పీక్స్ ..థియేట‌ర్‌లోనే బాణ‌సంచా కాల్చిన ఫ్యాన్స్‌

Hardworkneverfail