సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మూవీ ”అన్నాత్తే”. మాస్ డైరెక్టర్ సిరుతై శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగులో ”పెద్దన్న” అనే పేరుతో విడుదల చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీని దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా నటుడు వెంకటేశ్ టీజర్‌ని విడుదల చేశారు. రజనీకాంత్ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
ఈ మూవీ లో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. ఈ మూవీ విషయానికొస్తే.. సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో పిక్చరైజ్ చేశారు. దాంతో పాటు కోల్‌కత్తాలో కూడా కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేసారు.