Bright Telangana
Image default

Kaikala Satyanarayana : నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మరింత విషమం..

Actor Kaikala Health Condition Critical

సీనియర్ నటుడు, నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ (88) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తుండగా తాజాగా అపోలో వైద్యులు కైకాల హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కైకాల శనివారం ఉదయం తీవ్ర జ్వరం.. శ్వాస ఇబ్బందితో అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు ప్రకటించారు.

అప్పటి నుండి ఆయనకు వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌ బులిటెన్‌ను అపోలో వైద్యులు విడుదల చేశారు. “సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. మల్టీ ఆర్గాన్స్‌ ఫెయిల్‌ అయ్యాయి. చికిత్సకు ఆశించినంతగా ఆయన స్పందించటం లేదు’ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి ఆరా తీస్తున్నారు. ఆయన కోలుకుని తిరిగి రావాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

గత నెల 30న కూడా ఒకసారి కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా తిరిగి కోలుకున్నారు. అంతకు ముందు కూడా కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో కాలు జారిపడగా.. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు కూడా అలాగే తిరిగి కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. గత 60 ఏళ్ల సుదీర్ఘ సినీ కెరీర్ లో కైకాల సత్యనారాయణ సుమారు 777 మూవీల్లో నటించి అలరించి నటసార్వభౌముడిగా కీర్తి గడించారు.

Related posts

Shyam Singha Roy: భారీ మొత్తానికి అమ్ముడైన శ్యామ్ సింగ రాయ్ హిందీ రైట్స్

Hardworkneverfail

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన బాబు మోహన్

Hardworkneverfail

‘రిపబ్లిక్’ మూవీ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్ :పెట్టుబడిలో సగం కూడా రాలేదు

Hardworkneverfail

RRR : ‘ఆర్ఆర్ఆర్’ ఊర నాటు సాంగ్..నాటు డాన్సులతో కుమ్మేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్..

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో కూడా ప్రాఫిట్స్ తెప్పించిన పెళ్ళిసందD

Hardworkneverfail

సినీ హీరో నాని పై వివాదస్పద నటి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్

Hardworkneverfail