ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదలచేస్తున్నామని ప్రకటించింది మూవీ యూనిట్.
డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది. తాజాగా “ఆర్ఆర్ఆర్” మూవీ నుంచి సెకండ్ లిరికల్ సాంగ్ విడుదల అయింది.
ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ డాన్సులు చూసి ఫిదా అవుతున్నారు అభిమానులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్ అవుతోంది. సెకండ్ సింగిల్ యూ ట్యూబ్‌లో విడుదలైన మరుక్షణం నుంచి సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్సింగ్ కెమిస్ట్రీ అదుర్స్ అంతే. ప్రేమ్ రక్షిత్ ఈ పాటను కొరియోగ్రఫీ చేసాడు.