మహేశ్ బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న మూవీ ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేశ్ కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ స్పెయిన్‌లో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. లొకేషన్‌లో మహేశ్ బాబు, డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. అందులో మహేశ్ లుక్ ఆకట్టుకుంటోంది. మరోవైపు, సెట్‌లో తీసిన మహేశ్ ఫొటోను సంగీత దర్శకుడు తమన్ షేర్ చేశారు. స్టైలిష్ లుక్‌లో, గొడుగు పట్టుకుని కనిపించారు మహేష్.
మరో ఫొటోలో ఇదే లొకేషన్‌లో నాయిక కీర్తి సురేశ్‌తో మాట్లాడుతూ కనిపించారు మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్. ఇలా ఒకేసారి ఇన్ని సర్‌ప్రైజ్‌లు రావడంతో మహేశ్ అభిమానులు ఆనందపడుతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
#SarkaruVaariPaata BTS 👌🕺🕺@urstrulyMahesh #MaheshBabu
— Sarkaru Vaari Paata 🔔 (@UrsSureshR9) October 26, 2021
Do Follow For More 😐 pic.twitter.com/5WpzdMaeCr
#SarkaruVaariPaata BTS 🕺🕺@urstrulyMahesh #MaheshBabu pic.twitter.com/zH2YYEmYwi
— Sarkaru Vaari Paata 🔔 (@UrsSureshR9) October 26, 2021