మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పూణే లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. చెర్రీ, కియారా అద్వానీ పై ఓ పాట, కొన్ని కీలక సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’, చిరంజీవి ‘ఆచార్య’ మూవీలకి సంబంధించి తన వర్క్ కంప్లీట్ చేసిన రామ్ చరణ్ .. ఇప్పుడు శంకర్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో చరణ్ ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో, ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ మూవీ ఉండబోతోందట.
ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం #RC15 సరికొత్త రికార్డు సృష్టించింది. మూవీ ఫస్ట్‌లుక్ మరియు టైటిల్‌ను రివీల్ చేయకముందే థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను జీ స్టూడియోస్ వారు భారీ మొత్తానికి కొనుగోలు చేశారట.
జీ స్టూడియోస్ ఈ మూవీ థియేట్రికల్, శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ను కలిపి అన్ని భాషలకు గాను దాదాపు 350 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకుంది జీ సంస్థ. ఇంకా రీమేక్ రైట్స్, ఆడియో రైట్స్ ను దిల్ రాజు అమ్ముకోవచ్చు. సో, ఏ రకంగా చూసినా కూడా దిల్ రాజు సేఫ్ అయినట్లే. మంచి డీల్ రావడంతో ఇక దిల్ రాజు ఏ చీకూ చింత లేకుండా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవచ్చు. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి జీ స్టూడియోస్ నిధులు సమకూరుస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం దర్శకుడు శంకర్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రామ్ చరణ్ మరియు కియారా అద్వానీలపై సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఈ పాట #RC15 మూవీ లో హైలెట్ గా ఉంటుందని తెలుస్తోంది.