RRR First Week Collections Report : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీక్ రన్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది. మూవీ 6 వ రోజు కొంచం అంచనాలు తప్పినా కానీ 7 వ రోజు మాత్రం తిరిగి పుంజుకుని మంచి గ్రోత్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపి అంచనాలను మించి పోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం.
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 7వ రోజున 6.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకుంటే ఓవరాల్ గా రోజు ను ఆల్ మోస్ట్ 1 కోటి రేంజ్ లో గ్రోత్ ని చూపెట్టి ఏకంగా 7.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని 7వ రోజున దుమ్ము లేపింది. ఇక హిందీ లో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన ఈ మూవీ కర్ణాటక మరియు తమిళనాడులలో కూడా మంచి వసూళ్ళతో ఫస్ట్ వీక్ ని ముగించింది, కర్ణాటకలో ఇంకాస్త ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉండగా కేరళలో 4-5 రోజుల్లో స్ట్రైక్ వలన ఇబ్బందులు ఎదురు అయినా మొత్తం మీద ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్స్ తో ముగించింది.
ఓవరాల్ గా మూవీ ఇప్పుడు ఫస్ట్ వీక్ (RRR First Week Collections) పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే..
Nizam: 77.24Cr
Ceeded: 37.28Cr
Uttarandhra: 20.97Cr
East: 11.16Cr
West: 9.76Cr
Guntur: 14.03Cr
Krishna: 10.78Cr
Nellore: 6.45Cr
AP-TG Total: 187.67CR(279.50CR Gross)
Karnataka: 27.75Cr
Tamilnadu: 25.30Cr
Kerala: 8.00Cr
Hindi: 65.60Cr
ROI: 5.10Cr
OS: 73.45Cr
Total WW: 392.87CR (710CR Gross)
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీని మొత్తం మీద 451 కోట్ల రేటు కి అమ్మగా మూవీ 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా ఫస్ట్ వీక్ తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం మూవీ ఇంకా 60.13 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అంటే మూవీ ఇక ఈ వీకెండ్ లో మినిమమ్ జోష్ చూపెట్టినా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.