Bright Telangana
Image default

Acharya Movie : మెగా అభిమానులకు పండగే..ఆచార్య ‘సిద్ధ’ టీజర్ వచ్చేసింది

రామ్ చరణ్‌‌ సిద్ధ టీజర్‌

తెలుగు సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆచార్య’. చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రామ్ చరణ్ ‘సిద్ధ’ పాత్ర కి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.

ఈ టీజర్‌లో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్లో వచ్చే శ్లోకంతో సిద్ధ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేశారు. ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది’ అంటూ రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ఈ టీజర్‌‌ చూస్తుంటే మెగా అభిమానులకు గూస్ బంప్స్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. టీజర్ ఆఖర్లో చిరంజీవి కూడా కనిపించాడు.

ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి రామ్ చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తూనే మూవీలో ఎంతో కీలకమైన సిద్ద అనే పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. రామ్ చరణ్‌ సరసన పూజ హెగ్డే కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో విడుదల కానుంది.

Related posts

Chiranjeevi Meets CM Jagan : ఏపీ సీఎంతో చిరంజీవి భేటీ

Hardworkneverfail

RRR First Week Collections : 7 రోజుల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి వచ్చింది ఇది!

Hardworkneverfail

RRR Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల వేట స్టార్ట్.. అరాచకం అనేది చిన్నపదమే!

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 12 రోజుల కలెక్షన్స్

Hardworkneverfail

గోపీచంద్‌ ఆరడుగుల బుల్లెట్ రివ్యూ

Hardworkneverfail

ఆ షో చేయనంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ?

Hardworkneverfail