నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకుంటోంది. ముఖ్యంగా సెకండ్ వేవ్ అనంతరం ఇండియాలో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా లవ్ స్టొరీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. యూఎస్ లో కూడా ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకుంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తర్వాత ఇండియాలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన మూవీగా రికార్డులకెక్కింది ‘లవ్ స్టోరీ’. వీక్ డేస్ లో కొంత తడబడినా … తర్వాత మళ్ళీ పికప్ అయ్యి బ్రేక్ ఈవెన్ ని అందుకోనున్న ఈ సినిమా ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత 33 కోట్లకు పైగా బిజినెస్ ను, షేర్ ని సొంతం చేసుకున్న ఫస్ట్ సినిమాగా నిలవగా బ్రేక్ ఈవెన్ ని కూడా అందుకున్న మొదటి సినిమా కాబోతుంది…
నైజాం | 12.50 cr |
ఉత్తరాంధ్ర | 2.90 cr |
సీడెడ్ | 4.34 cr |
ఈస్ట్ | 1.60 cr |
వెస్ట్ | 1.33 cr |
గుంటూరు | 1.50 cr |
నెల్లూరు | 0.85 cr |
కృష్ణా | 1.36 cr |
ఏపీ + తెలంగాణ (మొత్తం) | 26.38 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.01 cr |
ఓవర్సీస్ | 4.78 Cr |
వరల్డ్ వైడ్ (మొత్తం) | 33.17 cr |
12 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి క్లోజ్ అయిన లవ్ స్టొరీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 60-80 లక్షల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలవనుంది. ఈ చిత్రానికి రూ.34 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.12 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.33.17 కోట్ల షేర్ ను రాబట్టింది.