Bright Telangana
Image default

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

rrr movie

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీకి టికెట్టు కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూవీ టిక్కెట్‌ ధరల తగ్గింపు వ్యవహారంపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డీవీవీ దానయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల తగ్గింపు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని.. దీంతో ఆ మూవీ యూనిట్ త్వరలో కోర్టు మెట్లు ఎక్కనుందంటూ గత కొన్ని రోజుల నుంచి వరుస కథనాలు నెట్టింట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై తాజాగా డీవీవీ దానయ్య స్పందించారు. ఏపీలో మూవీ టిక్కెట్‌ ధరలు తగ్గించడం మా మూవీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ మేము లేదా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదు. ఏపీ సీఎం జగన్‏ను కలిసి పరిష్కరించుకుంటామని కాసేపటి క్రితం ట్వీట్ చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రామ్‌చరణ్‌ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీనీ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

ఏపీలో ప్రస్తుతం నార్మల్‌ థియేటర్లలో 100 రూపాయల వరకు ఉన్న టికెట్‌ ధర,… మాల్టీప్లెక్స్‌లలో 250 వరకు ఉంది. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం వారం రోజుల పాటు టికెట్‌ ధర 500 రూపాయల ఉండాలని అంచనా వేస్తున్నారు. మరి ఆ స్థాయిలో రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా…? ఈ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారట మూవీ యూనిట్.

Related posts

Most Eligible Bachelor Movie: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ 2 వీక్స్ కలెక్షన్స్

Hardworkneverfail

RRR Trailer: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డుల వేట స్టార్ట్.. అరాచకం అనేది చిన్నపదమే!

Hardworkneverfail

Raja Vikramarka: ఏజెంట్‌ విక్రమ్‌ రెడీ

Hardworkneverfail

Saami Saami Song: రికార్డ్స్ సృష్టిస్తున్న సామీ సామీ సాంగ్..

Hardworkneverfail

Naga Chaitanya : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Hardworkneverfail

Actor Nani Sensational Comments : థియేటర్ల కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ..

Hardworkneverfail