Nani Sensational Comments on AP Ticket Rates : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీ టిక్కెట్ల ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై న్యాచురల్ స్టార్ నాని స్పందిస్తూ.. ఇది సరైనది కాదని అన్నారు. టిక్కెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రభుత్వం ప్రేక్షకులను అవమానపరిచింది. థియేటర్ల కలెక్షన్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల వసూళ్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
‘టికెట్ ధరలు పెరిగినా, ప్రేక్షకులు కొనుగోలు చేయగలుగుతారు.’ కానీ ఇప్పుడే ఏదైనా చెబితే వివాదం అవుతుందని” అని హీరో నాని అన్నారు.తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీలో తన ద్విపాత్రాభినయం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. తాను రెండు పాత్రలను ఆస్వాదించానని తెలిపాడు.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ‘శ్యామ్ సింగ రాయ్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.