Bheemla Nayak: పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ”భీమ్లా నాయక్”. మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ మూవీకి ఇది తెలుగు రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్.. రానా కు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ – ఇద్దరు హీరోల గ్లిమ్స్ – టైటిల్ సాంగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ మూవీని 2022, జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం పోస్ట్‌పోన్ చేయక తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.
‘భీమ్లా నాయక్’ మూవీ టైటిల్ సాంగ్ 20 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో మూవీ 2022 జనవరి 12 నే రిలీజ్ అవుతుందని డేట్ ప్రకటించారు. దీంతో మరోసారి మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించాడు. కాగా, ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు.. త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
The super massy track #LalaBheemla hits 20 M+ views & Trending on @youtubemusic🎶
— Sithara Entertainments (@SitharaEnts) November 18, 2021
► https://t.co/nLPbCgb3Zw
Music by @MusicThaman ⚡🥁#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @iamsamyuktha_ @arun_kaundinya @vamsi84 @adityamusic pic.twitter.com/4m7sF8Dqmm