Mega Star Chiranjeevi Mega Record : మెగాస్టార్ చిరంజీవి న్యూ రికార్డు సృష్టించారు. ఒకే నెలలో 4 మూవీస్ ను ఏకకాలంలో పూర్తి చేస్తూ రికార్డ్ సృష్టించారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఆచార్య, మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గాడ్ ఫాదర్, బాబీ దర్శకత్వంలో 154వ చిత్రం, మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్ మూవీస్ డిసెంబరు నెలలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఒకప్పుడు చిరంజీవి ఒకే ఏడాది 4 అంతకంటే ఎక్కువ మూవీస్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఒక్క నెలలోనే 4 మూవీస్ షూటింగ్స్ చేస్తూ ఒకే నెలలో అత్యధిక మూవీస్ చేసిన స్టార్ హీరోగా చిరంజీవి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు.
ఈ డిసెంబర్ లోనే 4 మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిరంజీవి ప్రపంచంలో ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు చేసిన హీరోగా రికార్డ్ సృష్టించారు. ఇంకా చెప్పాలంటే ఈ మూవీ షూటింగ్లలో పాల్గొంటూనే ఇతర కార్యక్రమాలకు కూడా చిరంజీవి అటెండ్ అవ్వడం ఆయన స్టామినాను తెలియజేస్తోంది. ఇక ఇవే కాకుండా కొందరు దర్శకులు మెగాస్టార్ చిరంజీవికి కథలు చెప్పడానికి సిద్దమవుతున్నారట. ఆయన కూడా యంగ్ డైరెక్టర్లతో చేయడానికి తానెప్పుడు సిద్దమే అని అనడంతో వారు ముందువరసలో ఉన్నారట.. మరి చిరంజీవి ఇలా వరుస మూవీస్ తో బిజీ కావడం మెగా ఫ్యాన్స్ కి పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అందుకే మెగా ఫ్యాన్స్ మెగాస్టారా .. మజాకానా అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.