Bright Telangana
Image default

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం.. ప్రకాశ్‌రాజ్‌

Prakash Raj Tweets on YCP Involvement in Maa Polls

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు ముగిసి దాదాపు రెండు వారాలు అవుతున్నా పరిశ్రమలో వివాదాలు సద్దుమణగడం లేదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎలక్షన్‌‌పై ప్రకాశ్ రాజ్ మరోమారు కామెంట్ చేశారు. ‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఆరోపణలు చేశారు. ఎన్నిక జరిగిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. ఎలక్షన్ రోజు సీసీటీవీ వీడియో ఫుటేజీ ఇవ్వాల్సిందిగా ఈసీ కృష్ణ మోహన్‌ను కోరారు. దీంతో కృష్ణ మోహన్ ప్రకాశ్ రాజ్‌‌కు సీసీటీవీ ఫుటేజీని చూపించారు. కానీ సగం వరకే చూసిన ప్రకాశ్ రాజ్.. మిగిలిన వీడియోను తర్వాత చూస్తామన్నారు. ఈ విషయంపై తాజాగా ఆయన ట్వీట్ చేశారు.

సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వాలని ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ మోహన్‌ను కోరిన ప్రకాశ్ రాజ్.. పోలింగ్‌ బూత్‌లో అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియజేయనివ్వండి. ఇది కేవలం ప్రారంభమేనన్నారు. ఈ ట్వీట్‌కు ‘మా’ ఎన్నిక నాటి ఫొటోలను జత చేశారు. ఈ ఫొటోల్లో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు పక్కన ఓ నూకల సాంబశివరావు అనే వ్యక్తిని చూడొచ్చు. అదే వ్యక్తి వైసీపీ కండువాతో జగన్ పక్కన ఉండటాన్ని కూడా గమనించొచ్చు. ఆ వ్యక్తిపై జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ కేసులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు సదరు కంప్లయింట్ కాపీని ఆయన ట్వీట్ చేశారు.

Related posts

Manchi Rojulochaie Collections: ఫస్ట్ వీక్ కలెక్షన్స్..ఇంత ఘోరమైన కలెక్షన్స్ .. !

Hardworkneverfail

LIVE : సిరివెన్నెల సీతారామశాస్త్రికి కన్నీటి వీడ్కోలు

Hardworkneverfail

Pushpaka Vimanam: ‘పుష్పక విమానం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటైల్స్…!

Hardworkneverfail

Bhola Shankar Movie: చిరంజీవి ‘బోళా శంకర్’ మూవీ ప్రారంభం..

Hardworkneverfail

Chiranjeevi: త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ .. త్వరలోనే అధికారిక ప్రకటన..

Hardworkneverfail

Pelli SandaD Collections: ప్లాప్ టాక్ తో హిట్టు కొట్టిన పెళ్ళిసందD

Hardworkneverfail