Bright Telangana
Image default

Bhola Shankar Movie: చిరంజీవి ‘బోళా శంకర్’ మూవీ ప్రారంభం..

బోళా శంకర్ మూవీ

మెగాస్టార్ చిరంజీవి వరుస మూవీలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి.. ‘గాడ్ ఫాదర్’ ‘భోళా శంకర్’ వంటి మూవీలను సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో తాజాగా భోళా శంకర్ మూవీని షురూ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం గురువారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేడుకగా జరిగింది.

తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్‏గా రూపొందనున్న ఈ మూవీ.. చిరంజీవి కెరీర్‏లో 155వ మూవీగా రాబోతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‏గా నటించనుండగా.. నవంబర్ 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ అన్నాచెల్లెళ్ల అనుబంధం మీద తెరకెక్కుతోంది. ఈ మూవీలో మెగాస్టార్ చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు.

మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఈ మూవీ తెరకెక్కుతుండగా.. 2022లో భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి దర్శకులు శివ కొరటాల, వంశీ పైడిపల్లి, గోపిచంద్ మలినేని, బాబీ, హరీశ్ శంకర్ విచ్చేశారు. దర్శకులు డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్ కొట్టగా.. మిగిలిన డైరెక్టర్స్ స్క్రిప్ట్ అందించారు, ఫస్ట్ షాట్‌కి అనిల్ రాం బ్రహ్మ సుంకర దర్శకత్వం వహించారు.

Related posts

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించిన బాబు మోహన్

Hardworkneverfail

Arjuna Phalguna Teaser : శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’ టీజర్ అదిరిందిగా..

Hardworkneverfail

Shyam Singha Roy: భారీ మొత్తానికి అమ్ముడైన శ్యామ్ సింగ రాయ్ హిందీ రైట్స్

Hardworkneverfail

Shiva Shankar Master : కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

Hardworkneverfail

గోపీచంద్‌ ఆరడుగుల బుల్లెట్ రివ్యూ

Hardworkneverfail

Akhanda : భం భం అఖండ… అదరగొడుతోన్న బాలకృష్ణ ‘అఖండ’ టైటిల్ సాంగ్

Hardworkneverfail