‘రాజ రాజ చోర’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న శ్రీవిష్ణు.. వైవిధ్యభరితమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు, తాజాగా ‘అర్జున ఫల్గుణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. నిరంజన్ రెడ్డి – అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీతో తేజ మర్ని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ‘నాది కాని కురుక్షేత్రంలో నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా బలైపోవడానికి నేను అభిమన్యుడిని కాదు .. అర్జునుడిని’ అనే శ్రీవిష్ణు డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది. ఈ మూవీపై ఆసక్తి పెరగడానికి ఈ ఒక్క డైలాగ్ సరిపోతుందేమో.
యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మాస్ పాత్రలో శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. కథ గ్రామీణ ప్రాంతంలోను .. అడవి నేపథ్యంలోను సాగనున్నట్టు అర్థమవుతోంది. ఈ టీజర్ చూసి ‘అద్దిరిపోయిందిగా .. న్యూ వెరైటీకి సెల్యూట్’ అంటూ రానా ట్వీట్ చేయడం విశేషం.