Bright Telangana
Image default

Avatar 2 Movie : అవతార్ 2 మూవీ కొత్త ట్రైలర్ వచ్చేసింది..

Avatar 2 Trailer

Avatar 2 New Trailer : 2009లో విడుదలైన ‘అవతార్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇక ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుండడంతో వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ ప్రేమికులు ఎప్పుడెప్పుడు ఆ విజువల్ వండర్ ని చూస్తామో అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. విడుదల దగ్గర పడడంతో, నేడు మరో కొత్త ట్రైలర్ ని విడుదల చేసింది మూవీ యూనిట్.

హాలీవుడ్ దర్శక నిర్మాత జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్.. అప్పట్లో హిందీ, తెలుగు మరియు ఇతర ఇండియన్ డబ్బింగ్ వెర్షన్‌ లో రికార్డు స్థాయిల్లో రిలీజ్ అవ్వడమే కాదు, అంతకుమించిన కలెక్షన్స్ ని అందుకుని ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యపోయేలా చేసింది ఈ మూవీ.

రెండు నిమిషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లోని విజువల్స్ ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. అవతార్-1 లో అంతరిక్ష అందాలని చూపించిన కామెరాన్, సీక్వెల్ లో సముద్ర అందాలను చూపించనున్నాడు. మొదటి భాగంలో అవతార్స్ కి పుట్టిన నెక్స్ట్ జెనరేషన్ అవతార్స్ తో ఈ మూవీ కథాంశం నడవనుంది. డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా అవతార్ 2 మూవీ గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మరి ఈ మూవీతో జేమ్స్ కామెరాన్ ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related posts

MAA Elections: నరేశ్‌ వల్లే ‘మా’లో ఇన్ని గొడవలు – శివాజీ రాజా

Hardworkneverfail

అల్లర్లతో ‘మా’ పరువు తీయవద్దు: చిరంజీవి

Hardworkneverfail

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్..

Hardworkneverfail

Shekar Movie : రాజశేఖర్ ‘శేఖర్‌’ మూవీకి ఓటీటీ నుండి వస్తున్న ఆఫర్స్ ..!

Hardworkneverfail

Pushpa Movie: ‘పుష్ప’ మూవీ స్పెషల్ సాంగ్ నుంచి సమంత సిజ్లింగ్ పోస్టర్ రిలీజ్..

Hardworkneverfail

MAA elections 2021: ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా

Hardworkneverfail