Bright Telangana
Image default

Akhanda Movie : బాలయ్య ‘అఖండ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్..

అఖండ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లు అర్జున్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కాంబోలో రానున్న మూడో మూవీ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్లు, ఫొటోలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. లేటెస్టే‌గా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు దీపావళి తరువాత మరో పండుగను అందించారు. దీంతో సోషల్ మీడియాలో బాలయ్య సందడితో షేక్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నాడు. అఖండ డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు మూవీ యూనిట్ ప్రశంసించారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్ నవంబర్ 27న హైదరాబాద్ లో శిల్పకళ వేదికలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరు కానున్నారు. బోయపాటి శ్రీను తెరకేకించిన సరైనోడు మూవీలో అల్లు అర్జున్ నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలకృష్ణ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ రానున్నారని తెలియడంతో ఇటు నందమూరి ఫ్యాన్స్ కి అటు మెగా ఫ్యాన్స్ కి మాత్రం కిక్కునిస్తుంది.

Related posts

Sarkaru Vaari Paata: సంక్రాంతి రేస్ నుంచి ‘సర్కారు వారి పాట’ ఔట్

Hardworkneverfail

Sirivennela Sitaramasastri : సిరివెన్నెల సీతారామశాస్త్రి క‌న్నుమూత..

Hardworkneverfail

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి సెకండ్‌ సాంగ్‌ ఆప్డేట్‌ వచ్చేసింది…

Hardworkneverfail

Enemy Collections: పర్వాలేదనిపించిన ‘ఎనిమి’ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ..!

Hardworkneverfail

Bheemla Nayak: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ టీజర్‌కు డేట్ ఫిక్స్..?

Hardworkneverfail

Krithi Shetty : బంగార్రాజు మూవీ నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..

Hardworkneverfail