Bright Telangana
Image default

Krithi Shetty : బంగార్రాజు మూవీ నుంచి నాగలక్ష్మి లుక్ వచ్చేసింది..

Krithi Shetty

కింగ్‌ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా మూవీ ఎంత హిట్టో అందరికీ తెలిసిందే! ఈ మూవీకి ప్రీక్వెల్‌ అయిన బంగార్రాజుతో హిట్‌ కొట్టడానికి రెడీ అవుతున్నాడు నాగార్జున. ఇక నాగార్జున సరసన సీనియర్ బ్యూటీ రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడిగా కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. ‘బంగార్రాజు’ మూవీలో ఏయన్నార్‌ని గుర్తు తెచ్చేలా నాగార్జున గెటప్‌ను డిజైన్‌ చేశారు ఈ దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బంగార్రాజు మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. తాజాగా కృతి శెట్టి లుక్ ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్.

బంగార్రాజు మూవీలో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించనుంది కృతి శెట్టి. నాగలక్ష్మి లుక్ ను నాగచైతన్య తన సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు. అచ్చమైన పల్లెటూరి పిల్లలా.. మేడలో పూలమాలతో కళ్లజోడును స్టైలుగా పట్టుకున్న కృతి లుక్ ను రిలీజ్ చేశారు. కృతి ఈ పోస్టర్ లో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మూవీని జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో చలపతి రావు.. రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Related posts

Bangarraju Teaser : సోగ్గాడు మళ్ళీ వచ్చాడు.. ‘బంగార్రాజు’ టీజర్

Hardworkneverfail

ఆకట్టుకుంటున్న నాగచైతన్య ’లవ్ స్టోరీ’ ట్రైలర్

Hardworkneverfail

Sarkaru Vaari Paata: సంక్రాంతి రేస్ నుంచి ‘సర్కారు వారి పాట’ ఔట్

Hardworkneverfail

HanuMan Teaser : ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో వచ్చేసాడు..!

Hardworkneverfail

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’

Hardworkneverfail

RRR Movie: టిక్కెట్‌ ధరల తగ్గింపుపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నిర్మాత అసంతృప్తి

Hardworkneverfail