శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అందమైన ప్రేమ కథ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్రైలర్ సినిమా పైన అంచనాలను పెంచేసింది. సినిమా అందమైన ప్రేమ కథతోపాటు హృదయాన్ని తాకే ఎమోషన్ కూడా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు.