Bright Telangana
Image default

Love Story: ‘లవ్‌స్టోరీ’ ఓటీటీ రిలీజ్‌ ట్రైలర్‌ అదిరింది..!

Love Story Only on aha

లవ్‌స్టోరీ’మూవీతో చాలా రోజుల తర్వాత సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ మూవీ గత నెలలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ని తాజాగా ప్రకటించారు. అక్టోబర్‌ 22న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా అందుబాటులో ఉంటుందని చిత్రబృందం తెలిపింది. మరోవైపు, ‘లవ్‌స్టోరీ’ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ.. ఆహా ఓ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. నటీనటులపై చిత్రీకరించిన ప్రేమ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఫీల్‌గుడ్‌ మూవీగా తెరకెక్కి.. ఆన్‌స్క్రీన్‌పై మ్యాజిక్‌ క్రియేట్‌ చేసిన ‘లవ్‌స్టోరీ’ మూవీకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇందులో రేవంత్‌ అనే మధ్యతరగతి కుర్రాడిలా నాగచైతన్య.. మౌనిక అనే పెద్దింటి అమ్మాయిగా సాయిపల్లవి నటించి మెప్పించారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మించారు.

Related posts

Naga Chaitanya : ‘థాంక్యూ’ మూవీ నుంచి నాగ చైతన్య ఫస్ట్ లుక్ విడుదల..

Hardworkneverfail

‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ ఓటిటి రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్..ఎప్పుడంటే..?

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ 12 రోజుల కలెక్షన్స్

Hardworkneverfail

లవ్ స్టోరీ మూవీ రివ్యూ

Hardworkneverfail

లవ్ స్టొరీ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Hardworkneverfail

Love Story: ఓటీటీలో నాగచైతన్య ‘లవ్ స్టొరీ’ మూవీ..ఎప్పుడంటే?

Hardworkneverfail