న్యాచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ టీజర్ వచ్చి ఆకట్టుకుంటోంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఈ మూవీలో నాని చేస్తున్న వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తుండడం.. ముగ్గురు హీరోయిన్లు ఉండడంతో మూవీ మీద అంచనాలు ఏర్పడ్డాయి.
కలకత్తా నేపథ్యం మూవీకి హైలెట్‌గా నిలవబోతోందని తాజాగా రిలీజైన టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక నాని పర్ఫార్మెన్స్ మరో లెవల్‌లో ఉండబోతోంది అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో నానికి సాలీడ్ హిట్ దక్కలేదు. ఆ హిట్ ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీతో దక్కబోతోందనిపినిస్తోంది. కాగా, ఈ మూవీకి సత్యదేవ్ జంగా కథను అందించగా.. మెలోడి స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 24న ఈ మూవీ విడుదలకానుంది.